చంద్రుడనే కవి పుడమి కాగితంపై 
కిరణమనే కలంతో 
విరచించిన వెన్నెల కవిత్వం. 
సూర్యుడు పడమరవైపు జారుకుంటే 
ప్రపంచాన్ని చీకటి ఆక్రమించుకుంటుందా ?
సముద్రగర్భంలో కూరుకుపోయినంత మాత్రాన 
ముత్యాలు నీటి బిందువులవుతాయా ?
నాగరికత, ప్రకృతి, విజ్ఞానం ఎంత పెరిగినా 
మానవుడు నిస్సహాయుడై నిలిచెను.
ఈర్ష్యా ద్వేషాలు, కక్షలు కార్పణ్యాలు 
మనిషిని కాటువేసే కాలసర్పాలైయాయి.
అవనిలో దౌర్జన్యపరులు రేకెత్తిస్తున్న రక్తపాతం 
మానవ మనుగడపై ప్రభావం చూపుతుంటే 
చేతి రేఖలకు బ్రతుకులు బానిసలై 
జీవిత ప్రణాళికను సూచిస్తున్నాయి.
రకరకాల మనుజులు, వివిధ మనస్తత్వాలు 
బాధలతో విలవిలలాడుతూ 
అసూయ తప్ప ఆత్మీయత తెలియని 
వర్తమానంలోకి కూరుకుపోతున్నారు.
మానవ హృదయాలను 
ఆవరించిన కరిమేఘాలు మాయమై 
ఉషోదయపు ధవళ రేఖలు  ఉదయించేడెప్పుడు ?
- గుర్రంకొండ నీరజ 
हिंदी लिप्यन्तरण 
मानव मनुगड
 [मानव जीवन ]
चंद्रुडने कवि पुडमि कागितंपै 
किरणमने कलंतो 
विरचिंचिन वॆन्नॆल कवित्वं. 
सूर्युडु पडमरवैपु जारुकुंटे 
प्रपंचान्नि चीकटि आक्रमिंचुकुंटुंदा ?
समुद्रगर्भंलो कूरुकुपोयिनंत मात्रान 
मुत्यालु नीटि बिंदुवुलवुताया ?
नागरिकत, प्रकृति, विज्ञानं ऎंत पॆरिगिना 
मानवुडु निस्सहायुडै निलिचॆनु.
ईर्ष्या द्वेषालु, कक्षलु कार्पण्यालु 
मनिषिनि काटुवेसे कालसर्पालैयायि.
अवनिलो दौर्जन्यपरुलु रेकॆत्तिस्तुन्न रक्तपातं 
मानव मनुगडपै प्रभावं चूपुतुंटे 
चेति रेखलकु ब्रतुकुलु बानिसलै 
जीवित प्रणाळिकनु सूचिस्तुन्नायि.
रकरकाल मनुजुलु, विविध मनस्तत्वालु 
बाधलतो विलविललाडुतू 
असूय तप्प आत्मीयत तॆलियनि 
वर्तमानंलोकि कूरुकुपोतुन्नारु.
मानव हृदयालनु 
आवरिंचिन करिमेघालु मायमै 
उषोदयपु धवळ रेखलु  उदयिंचेडॆप्पुडु ?
 - नीरजा 
