शनिवार, 30 मई 2009

तेलुगु कविता : జీవన స్రవంతి

ప్రభాత తుషారంలో తడిచిన గులాబీ మొగ్గ
వికసించక మానుతుందా ?
నేలకోరుగుతానేమోనని అరటి చెట్టు
గెలవేయక మానుతుందా ?

వట్టి పోతానేమోనని మేఘమాల
వర్షించక మానుతుందా ?
చెదిరి పోతానేమోనని నా స్వప్న స్వరూపం
రూపాంతరం చెందక మానుతుందా ?

అతిధి స్వికరించనంత మాత్రాన
అమృతం విషంగా మరేన ?
ఎవ్వరు వాడనంత మాత్రాన , గుర్తించనంత మాత్రాన
మాణిక్యం మసి బొగ్గై పోతుందా ?

వెల వత్సరాలు భుగర్భంలో కూరుకుపాయి ఉన్నా
రాట్నం రాయిగా మారేన
ధగ ధగ లాడే పలుగు రాల్లయిన
రత్నలుగా మారేన ?

జీవన క్షేత్రం లో అహర్నిశలు ఏదో వెతుకుతూ
క్షణానికో నడక నడిచే జీవన స్రవంతి లో
మనో భావాలు ముఖ పద్మంపై
నీడలై నర్తించవా ?

అంధకార భందురమైన ఈ గహనంలో
స్వర్గ సౌఖ్యల మార్గం చూపుతామంటూ
నరక భయాలను రెచ్చగొట్టి బతికే
పరన్ను భుక్కులు అందినంత వరకు ప్రజల్ని దోచు కొంటున్నారు .

మతాలు , ఆచారాలు , వేదాలు , వేడంతాలని
దైవం పేరుతొ దగా చేసే
కుక్షింభర విష కీటకాలు
మానవ జీవితాన్ని తొలిచి డొల్ల చేస్తున్నాయి .

జిగేలు మంటూ , మరు క్షణం ఆరిపోయే మతాబులను చూసి
చంద్రుడో , సూర్యుడో అని భ్రమ పడుతూ
చీకటి ఊబిలో కూరుకు పోతున్న
ఈ ఆశిష్ జన వాహిని కి వెలుగు చూపించడం సాధ్యమా ?

1 टिप्पणी:

युग मानस yugmanas ने कहा…

మీ కవిత చాలా బాగుంది - డా. సి. జయ శంకర బాబు